ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ 4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. 9,168 పోస్టులకు నోటిఫికేషన్ని టీఎస్పీఎస్సీ జారీ చేసింది. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షను నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. ఇటీవల 9,168 పోస్టులకు ప్రభుత్వం అనుమతి జారీ చేసిన విషయం తెలిసింది. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారీగా ఖాళీల భర్తీ చేపడుతున్నందును అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గ్రూప్ 4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

© File Photo