తెలంగాణలో మరో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 1,326 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని మెడికల్ బోర్డుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు. నిన్న సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఉద్యోగాల భర్తీపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 12,755 పోస్టులు ఖాళీగా ఉండగా.. తొలి దశలో భాగంగా 1,326 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.