జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ ఖరారైనట్లు తెలుస్తోంది. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను తీసుకున్నారని ప్రచారం జరిగింది. కానీ, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ వైపు చిత్రబృందం మెుగ్గుచూపుతుందని టాక్ వినిపిస్తోంది. ఆమెను దాదాపు ఎంపిక చేసినట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని సినీవర్గాలు చెబుతున్నాయి. మృణాల్ ఎంపిక చేశారనే వార్తలతో తారక్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.