ముగిసిన ఉమామ‌హేశ్వ‌రి అంత్య‌క్రియ‌లు

© File Photo

ఎన్‌టీఆర్ నాలుగో కూతురు ఉమామ‌హేశ్వ‌రి అంత్య‌క్రియ‌లు ముగిశాయి. ఆమె ఇంటినుంచి జూబ్లిహిల్స్‌లోని మ‌హాప్ర‌స్థానం వ‌ర‌కు అంతిమ‌యాత్ర జ‌రిగింది. ఉమా మ‌హేశ్వ‌రి సోద‌రులు బాల‌కృష్ణ‌, రామ‌కృష్ణ‌, ఇత‌రులు పాడెను మోశారు. ఆమె చితికి ఆమె భ‌ర్త శ్రీనివాస ప్ర‌సాద్ నిప్పంటించారు. అంత్య‌క్రియ‌ల‌కు టీడీపీ అదినేత చంద్ర‌బాబునాయుడు, లోకేశ్, ఇత‌ర టీడీపీ నాయ‌కులు, కొంత‌మంది సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

Exit mobile version