ఆస్కార్ అవార్డుల వేడుకల సందర్భంగా సోషల్ మీడియాలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పేరును ఎక్కువగా ప్రస్తావించినట్లు ‘నెట్ బేస్ క్విడ్’ సంస్థ తెలిపింది. ఈ విషయంలో రామ్‌చరణ్ రెండో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. మూడో స్థానంలో ‘ఎవ్రీథింగ్’ మూవీ నటుడు కె హుయ్ ఖ్యాన్ నిలిచాడని.. తర్వాతి స్థానాల్లో బ్రెండన్ ఫ్రేజర్ (ది వేల్), పెడ్రో పాస్కల్‌లు నిలిచినట్లు వెల్లడించింది. అత్యధికంగా ప్రస్తావించిన సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఆస్కార్ వేడుకలను 18.7 మిలియన్ల మంది వీక్షించినట్లు తెలిపింది.