‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్‌లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సరదాగా కాసేపు ముచ్చటించారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ చేసిన సీతయ్య సినిమా తనకు చాలా ఇష్టమని కీరవాణి అన్నారు. అయితే ఆ సీతయ్య సినిమాను ఇప్పుడు నువ్వు రీమేక్స్ చేస్తే చూడాలని ఉంది అని ఎన్టీఆర్‌తో చెప్పాడు. దీంతో ఎన్టీఆర్ మీరు సంగీతం అందిస్తానంటే చేస్తాను అని సమాధానం ఇచ్చాడు. ఆ సినిమాలో తన తండ్రి క్యారెక్టర్ నాక్కూడా చాలా ఇష్టమని చెప్పాడు. పక్కనే ఉన్న చరణ్ కూడా ఇప్పటి పరిస్థితులకు తగినట్లుగా కథ రాస్తే చేయొచ్చని ఎన్టీఆర్‌తో అన్నాడు. మరి ఆ సినిమా రీమేక్ వస్తుందో లేదో చూడాలి.