మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా RRR విడుదలకు సిద్ధమైంది. అందుకోసం శరవేగంగా ప్రమోషన్స్ చేస్తుంది. అందులో భాగంగా డైరెక్టర్ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ఓ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు సినిమాలోని ఓ డైలాగ్‌ను ఎన్టీఆర్ చెప్పాడు. సినిమాలో కామన్ డైలాగ్ అయిన ‘అట్లుంటది మనతోనే’ అనే డైలాగ్‌ను రాజమౌళిని ఉద్దేశించి చెప్పాడు. ప్రస్తుతం ఆ డైలాగ్ వైరల్‌గా మారింది.