యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన RRR మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతోంది. మీకు ఎవరితో స్క్రీన్ షేర్ (మల్టీస్టారర్) చేయాలని ఉందని అడగ్గా.. మహేశ్ బాబు, అల్లు అర్జున్, నాగార్జున, చిరంజీవి, బాల బాబాయ్‌తో చేయాలని ఉందని తెలిపాడు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.