యువకులు, పెళ్లైన పురుషులతో పరిచయం పెంచుకుని వారికి నగ్న చిత్రాలు పంపుతూ డబ్బులు వసూలు చేస్తున్న మహిళను కర్ణాటక మైసూరు పోలీసులు అరెస్ట్ చేశారు. భర్త చెప్పినా వినకుండా మహిళ ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. పిరియా పట్టణానికి చెందిన సవిత.. యువకులను పరిచయం చేసుకుని ఫోన్లో చాట్ చేస్తుంది. ఆ తర్వాత నగ్న చిత్రాలతో వారిని ఊరడించి అందినకాడికి వసూలు చేస్తుంది. ఇలా లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.