హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ ప్రారంభమైంది. తెలంగాణ మంత్రులు హరీష్‌రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలు ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్లో 2400 స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 15 వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఎగ్జిబిషన్ టికెట్ రూ.40గా నిర్ణయించారు. ఐదేళ్ల లోపు పిల్లలను ఉచితంగా అనుమతిస్తారు. మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 10.30 వరకు సందర్శకులను అనుమతిస్తారు.