టీమిండియా యంగ్ సెన్సేషన్ శుభ్‌మన్ గిల్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో గిల్ (128) శతకం బాదాడు. ఈ ఏడాదిలో గిల్‌కు ఇది ఐదో శతకం. దీంతో ఒకే ఏడాదిలో అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన నాలుగో క్రికెటర్‌గా 24 ఏళ్ల గిల్ నిలిచాడు. ఇంతకుముందు కేఎల్ రాహుల్ సురేష్ రైనా, రోహిత్ శర్మ నిలిచారు. అత్యంత పిన్న వయసులో ఆసీస్‌పై సెంచరీ చేసిన రెండో భారత ఓపెనర్‌గా కూడా రికార్డులకెక్కాడు. అతడికన్నా ముందు కేఎల్ రాహుల్ (23) ఉన్నాడు.