టీ20లకు విశేష ఆదరణ దక్కి.. వన్డేలు, టెస్టులు ప్రాభవాన్ని కోల్పోతుండటంపై టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. వన్డేలు, టెస్టులను పట్టించుకోకుండా.. టీ20లను ముందుకు తీసుకెళ్లలేమని తెలిపారు. ఇటీవల ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్‌కు ఆదరణ కరువైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘వన్డే, టెస్టులపై ఐసీసీ దృష్టిసారించింది. టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్‌కప్‌లను నిర్వహిస్తోంది. ఆటగాళ్లకు టీ20 ద్వారా ఆదాయం రావొచ్చు. కానీ, ఈ రెండూ లేకుండా టీ20లను ముందుకు తీసుకెళ్లలేం’ అని సెహ్వాగ్ సూచించారు.