చిరుత.. ఈ పేరు వింటేనే మనలో చాలా మంది పరుగెత్తి ఆమడ దూరంలో దాక్కుంటారు. కానీ ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లాకు చెందిన దశరథ్ అనే వ్యక్తి మాత్రం చిరుత చేతిలో చిక్కుకున్న తన వదిన మైనాను కాపాడేందుకు చిరుతతోనే ఫైట్ చేశాడు. చిరుత తన మీద దాడి చేసినా కానీ వదల్లేదు. వీళ్ల కేకలను విని ఇరుగుపొరుగు వారు రావడంతో ఆ చిరుత వారిని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. స్థానికులు వారిద్దర్ని ఆసుపత్రిలో చేర్పించడంతో ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.