నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కార్తికేయ-2. ఇప్పటికే విజయవంతమైన కార్తికేయకు సీక్వెల్ గా ఇది తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రబృందం బంపర్ ఆఫర్ ప్రకటించింది. #KarthikeyaQuest పేరిట ఓ పొడుపు కథను ఇచ్చి అది విప్పితే బంగారు కృష్ణుడి ప్రతిమను పొందవచ్చని ప్రకటించింది. ‘ విశ్వం ఒక పూసల దండ, నిధి నీ భాగ్యంలో ఉంది అంటే భాగ్యనగరపు నడి బొడ్డులో ఉన్న జనాల పూసల దండని చేరుకో’ అంటూ క్లూ ఇచ్చింది.