బాసర IIIT క్యాంపస్‌లోని మెస్‌లో కప్పలు, తోక పురుగులు వస్తున్నాయని విద్యార్థులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమై క్యాంటీన్ పరిశీలనకు వెళ్లింది. నిర్మల్ జిల్లా ఎస్. ఎఫ్. ఓ ప్రత్యూష మెస్ క్యాంటీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న కొన్ని ఆహార పదార్థాలను సీజ్ చేసినట్లు చెప్పారు. మరికొన్నింటిని ల్యాబ్‌కు పంపామని పేర్కొన్నారు. వాటి రిపోర్టులు వచ్చాక చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇక అధికారులతో విద్యార్థులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.