TS: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో విధి నిర్వహణ అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రధాన పార్టీల నేతల ఒత్తిళ్లు తాళలేక కొందరు అధికారులు దీర్ఘకాల సెలవుపై వెళ్తున్నట్లు తెలుస్తోంది. పెండింగు బిల్లులకు సంబంధించిన విషయమై అనుమతి ఇవ్వాలని ఒకరు; అలాగే పెండింగులో ఉంచాలని మరొకరు ఒత్తిడి చేస్తుండటంతో ఏం చేయాలో అధికారులకు పాలు పోవట్లేదట. దీంతో లాంగ్ లీవ్‌పై వెళ్తున్నారు. ఫలితంగా అభివృద్ధి కుంటుపడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ విజయం సాధించారు.