రేపే ‘ఒకే ఒక జీవితం’ ట్రైల‌ర్‌

శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తున్న ద్విభాషా చిత్రం ‘ఒకే ఒక జీవితం’. త‌మిళ్‌లో దీన్ని క‌ణం పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ట్రైల‌ర్ రేపు మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. శ‌ర్వానంద్, వెన్నెల కిశోర్, ప్రియ‌ద‌ర్శి ముగ్గురు స్నేహితుల్లా న‌టిస్తున్నారు. రీతూ వ‌ర్మ హీరోయిన్. అక్కినేని అమ‌ల శ‌ర్వానంద్ త‌ల్లి పాత్ర పోషించింది. టైమ్ ట్రావెల్ క‌థ‌గా చెప్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. శ్రీ కార్తిక్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సెప్టెంబ‌ర్ 9న సినిమా రిలీజ్ కానుంది.

Exit mobile version