మహారాష్ట్రలోని అమరావతిలో పాతభవనం కూలి ఐదుగురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనంలోని దుకాణాల్లో కొంతమంది పనిచేస్తుండగా ఘటన జరిగింది. పురాతనమైన ఆ ఇంటిని కూల్చివేయాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. ఐదుగురి మృతికి సంతాపం తెలిపిన సీఎం ఏక్నాథ్ షిందే..రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.