వరల్డ్ కప్‌కు వచ్చే ముందు టీమిండియా బౌలింగ్ ప్రదర్శనపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. సూపర్ 12 స్టేజ్‌లో విజయాలతో కాస్త నమ్మకం కలిగించారు. కానీ తప్పక గెలవాల్సిన సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చేతులెత్తేశారు. 2014 నుంచి నాకౌట్ గేమ్స్‌లో పేలవ ప్రదర్శనలతో ఇంటిబాట పడుతున్న టీమిండియా మరోసారి అదే రిపీట్ చేసింది. ఫైనల్‌కు చేరేందుకు ఇంగ్లండ్‌తో పోరులో ఘోర పరాజయం పాలైంది. టాస్ గెలిచి తొలు బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ భారత ఓపెనర్లను బాగా కట్టడి చేసింది. రాహుల్, కోహ్లీ మరోసారి నిరాశపరిచారు. ఆ తర్వాత కోహ్లీ మరో అర్ధశతకం సాధించినా అది ఆశించినంత వేగంగా రాలేదు. చివరి 10 ఓవర్లలో పాండ్యా 63(33)మెరుపులతో 168 పరుగులు చేయగలిగింది. కానీ ఇంగ్లండ్ ఓపెనర్లు బట్లర్, అలెక్స్ హేల్స్ ఎక్కడా చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా లక్ష్యాన్నిఊదిపారేశారు. ఫైనల్లో ఇండియా పాక్‌ను ఆడనివ్వమన్న బట్లర్ మాట నిలబెట్టుకున్నాడు.
పాత కథే! ఇంటిబాట పట్టిన టీమిండియా!
