ఎన్‌టీఆర్‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తిన ఒలీవియా

RRR లో కొమురం భీముడో పాట స‌మ‌యంలో ఎన్‌టీఆర్‌ను చూసి త‌న‌కు క‌న్నీళ్లు వ‌చ్చాయ‌ని చెప్పింది హాలివుడ్ న‌టి ఒలీవియా మోరిస్‌. ఆమె ఆర్ఆర్ఆర్ సినిమాలో భీమ్‌ను ఇష్ట‌ప‌డే బ్రిటీష్‌ అమ్మాయిగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన ఒలీవియా.. ఎన్‌టీఆర్ చాలా మంచి న‌టుడ‌ని, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని కొనియాడింది. మ‌రోవైపు రామ్ చ‌ర‌ణ్ కూడా నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడ‌ని వెల్ల‌డించింది. ఈ మూవీలో భాగ‌మైనందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. కెరీర్ ప్రారంభంలోనే ఇంత పెద్ద ప్రాజెక్టులో న‌టించినందుకు ఆనందం వ్య‌క్తి చేసింది. ఒలీవియా అంత‌కుముందు ‘హోటల్ పోర్టోఫినో’ అనే బ్రిటీష్ సీరియ‌ల్‌లో న‌టించింది.
RRR Olivia Morris Exclusive Interview With Premamalini | Jr.NTR, Ram Charan, Rajamouli - TV9 ET

Exit mobile version