బీహార్‌లో ప్ర‌మాద‌క‌ర‌ వేరియంట్ క‌ల‌క‌లం

© Envato

బీహార్‌లో కొత్త ర‌కం క‌రోనా వేరియంట్ క‌ల‌క‌లం రేపుతుంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ BA.12 వేరియంట్ మొద‌టి కేసు న‌మోదైంది. ఒమిక్రాన్ (BA.2) కంటే ఇది ప‌ది రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెప్తున్నారు. నిన్న పాట్నాలోని ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐజీఐఎంఎస్)లో 13 శాంపిల్స్ ప‌రిక్ష చేయ‌గా 12 ఒమిక్రాన్ BA.2 , ఇంకొకటి BA.12 అని గుర్తించారు. ఈ వేరియంట్ మొద‌ట అమెరికాలో బ‌య‌ట‌ప‌డింది. గత వారం ఢిల్లీలో మూడు కేసులు న‌మోద‌య్యాయి. ఇప్పుడు బీహార్‌లో ఈ వైర‌స్‌ వెలుగు చూడ‌టంతో భ‌యాందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి.

Exit mobile version