ఆఫ్ఘానిస్తాన్ పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి ఆ దేశ పరిస్థితి ఘోరంగా తయారైంది. కొత్త కొత్త నిబంధనలు, అనుభవం లేని పాలనతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. గతంలో ఆఫ్ఘానిస్తాన్‌లో స్టార్ న్యూస్ యాంకర్‌గా వెలుగొందిన ముసా మహమ్మది అనే వ్యక్తి ఇప్పుడు రోడ్డు పక్కన సమోసాలు అమ్ముకుంటున్నాడు. ఎలాంటి దిక్కు లేని వాడిలా.. ఉన్న అతడిని చూసి నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. ఆయన సమోసాలు అమ్ముకుంటున్న ఫోటోలను కబీర్ హక్మాల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.
-
Courtesy Twitter:
-
Courtesy Twitter: