బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ తనకు జారీ చేసిన నోటీసులను రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం.తన పిటీషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఆమె కోరనున్నట్లు తెలుస్తోంది. కాగా కవిత పిటీషన్‌ను ఈ నెల 24న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా ఈ నెల 20 కవిత ఈడీ విచారణకు హాజరు కానుంది. ఈలోగా ఈడీ విచారణను రద్దు చేసేలాగా సుప్రీంను ఆశ్రయిస్తోంది.