మరోసారి అంతర్జాతీయ వేదికపై కేటీఆర్‌

© ANI Photo(file)

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. సెర్బియాలో జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాలని కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరం సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో అక్టోబర్‌ 20న సదస్సు నిర్వహించబోతోంది. ‘బయోటెక్‌ భవిష్యత్‌ వేదిక’ పేరిట జరగనున్న ఈ సదస్సులో బయోటెక్నాలజీ రంగంలో మార్పులు, అవకాశాలపై వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు, రంగ నిపుణుల మధ్య చర్చ జరగనుంది. సదస్సుకు ఆహ్వానం పంపినందుకు సెర్బియా పీఎంకు, WEFకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ సదస్సు రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తుందని ఆయన ఆకాంక్షించారు.

Exit mobile version