ఎన్నికల్లో ఒకటి కంటే ఎక్కువ చోట్ల పోటీ చేయకుండా కట్టడి చేసేందుకు తొలి అడుగు పడింది. ఓ అభ్యర్థి కేవలం ఒకే స్థానంలో పోటీ చేసేందుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. ఈ మేరకు చేసిన ప్రతిపాదనను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపించింది. ఒక అభ్యర్థి వేర్వేరు చోట్ల పోటీచేయడం వల్ల ఎన్నికల ఖర్చు, శ్రమ వృథా అవుతుండటమే ఇందుకు కారణమైనట్లు తెలుస్తోంది. ఈసీ ప్రతిపాదనకు న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపితే ఎన్నికల సంస్కరణకు నాంది పలికినట్లే.
ఒక అభ్యర్థి.. ఒకే స్థానంలో..!

© ANI Photo(file)