ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్న మాంద్యం పరిస్థితుల కారణంగా… దిగ్గజ సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో అనేక మంది ఉద్యోగులు కలవరంతో కాలం గడుపుతున్నారు. దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు లేఆఫ్‌ల గురించి భయపడుతున్నారని మార్కెటింగ్ డేటా అండ్ అనలిటిక్స్ సంస్థ కాంటార్ (Kantar) నిర్వహించిన సర్వే వెల్లడించింది. “ప్రపంచ ఆర్థిక మందగమనం, కొవిడ్ ముప్పు మళ్లీ తప్పదేమో అనే అంచనాలపై భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి నలుగురిలో ముగ్గురు ధరల పెరుగుదలపై కలవరపడుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించాలని వారు కోరుకుంటున్నారు.”అని సర్వే వెల్లడించింది.