ఎంతో భద్రత ఉండే మెట్రో స్టేషన్ లిఫ్టులో ఓ ఆకతాయి అల్లరి పనులు చేశాడు. ఖైరతాబాద్ కు చెందిన యువతిని భయబ్రాంతులకు గురి చేశాడు. ఆ యువకుడు అమ్మాయితో కలిసి లిఫ్టులోకి వెళ్లి బట్టలు విప్పి వెకిలి వేశాలు వేశాడు. దీంతో హడలిపోయిన యువతి మెట్రో సిబ్బందికి విషయం చెప్పింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు రాజు (19) అనే ఆకతాయిని అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజులుగా ఇలాగే యువతులను వేధిస్తున్నట్లు రాజు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.