సినీ నటుడు, రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్క భార్య ముద్దు.. రెండో భార్యను తెచ్చుకోవద్దంటూ హితవు పలికారు. “ నాకు ఒక్కరు చాలు. పెరుగుతున్న ఖర్చుల కారణంగా నేను ఇంకొకరిని పెళ్లి చేసుకొని పోషించలేను. కొందరు నాపై ఆసక్తి చూపించారు. మన చుట్టూ ఎంత నీరున్నా సరే అందులో ఒక్క చుక్క కూడా మనం తాగలేమని గుర్తొచ్చేది. వైవాహిక బంధంలో నిజాయితీగా ఉండాలి. గౌరవం, ప్రేమ ఇచ్చిపుచ్చికోవాలి” అని పేర్కొన్నారు.