టాలీవుడ్లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. మహేశ్ బాబు కెరీర్‌ని మలుపు తిప్పిన ‘ఒక్కడు’ సినిమాని మళ్లీ థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి 7న రీరిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ విలన్‌గా చేశారు. భూమిక చావ్లా మహేశ్‌కు తోడుగా నటించింది. ఈ సినిమా కోసం గుణశేఖర్ అండ్ టీం.. చార్మినార్ సెట్‌ని ప్రత్యేకంగా వేయడం విశేషం. మణిశర్మ అందించిన మ్యాజికల్ మ్యూజిక్కు సినీ అభిమానులు పరవశులైపోయారు. కాగా, పవన్ కళ్యాణ్ ఖుషీ ఈ నెల 31న రీరిలీజ్ కానుంది.