ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ)లో ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 1.5 శాతం వాటాను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వానికి రూ.3,000 కోట్లకు పైగా నిధులు సమకూరుతాయి. ఒక్కో షేరు కనీస ధరను రూ.159గా నిర్ణయించింది. ఇష్యూ నేటి నుంచి ఆఫర్ ఫర్ సేల్ నేటి నుంచి ప్రారంభమవుతుంది. రిటైల్ ఇన్వెస్టర్లు గురువారం నుంచి పాల్గొనవచ్చు. FY 22కి నిర్దేశించబడిన రూ.78,000 సవరించిన లక్ష్యంలో భాగంగా ఈ వాటా ఉపసంహరణ జరుగుతుంది.