తుంగభద్ర ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

Screengrab Twitter:

ఏపీ కర్నూల్ జిల్లాలోని తుంగభద్ర ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఇంకా కొనసాగుతుంది. ఎగువన వర్షాలు కురవడంతో వరద ప్రవాహం పెరుగుతుంది. దీంతో అధికారులు 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 46,810 క్యూసెక్కులు వస్తుండగా, అవుట్ ఫ్లో 54,336 క్యూసెక్కులుగా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు ఉండగా, ప్రస్తుతం 1632.45 అడుగులకు నీరు చేరింది.

Exit mobile version