AP: అనకాపల్లిలో నిన్న రాత్రి పూడిమాక బీచ్ లో గల్లంతైన విద్యార్థుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మొత్తం ఏడుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. ఇప్పటి వరకు నలుగురి మృతదేహాలను విపత్తు బృందం వెలికితీసింది.మిగిలిన వారి ఆచూకి కోసం కోస్ట్ గార్డ్ హెలీకాప్టర్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.