మార్చి 19న విశాఖ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరగనుంది. మ్యాచ్ కోసం ఈనెల 10నుంచి ఆన్ లైన్లో టిక్కెట్లను విక్రయించనున్నారు. 13నుంచి ఆఫ్ లైన్లో మ్యాచ్ టిక్కెట్లు అందుబాటులో ఉండనున్నాయి. రూ.600 నుంచి రూ.6 వేల మధ్య టిక్కెట్ రేట్లు నిర్ణయించారు. తొలిసారి బార్ కోడ్ అమలు చేస్తున్నారు. మ్యాచ్ నిర్వాహణకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొలి వన్డే మార్చి 17న ముంబైలోని వాంఖాడే స్టేడియంలో జరగనుంది.