2023లో ప్రపంచవ్యాప్తంగా చూడదగ్గ ప్రదేశాల్లో భారత్ నుంచి కేరళ ఒక్కటే ఎంపికైంది. న్యూయార్క్ టైమ్స్ రూపొందించిన 52 ప్రదేశాల జాబితాలో కేరళలోని కుమరకోమ్ కూడా అర్హత సాధించింది. బ్యాక్ వాటర్, అందమైన జలపాతాలు ఉండటం కుమరకోమ్ ప్రత్యేకత. ఇక్కడ కాలువల్లో తెడ్డుల ద్వారా ప్రయాణించడం, తాటి చెట్లు ఎక్కడం, కొబ్బరి పీచుతో తాళ్లను నేయడం వంటివి పర్యటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయని న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది. అందమైన ప్రదేశాలే కాకుండా బాధ్యతాయుత పర్యటకం ఉండటంతో కేరళ ఈ జాబితాకు ఎంపికైంది.