శ్రీలంకతో మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ అజేయ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో కెరీర్లో 3వ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక వేగంగా 1500 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్మన్గా సూర్య రికార్డు సృష్టించాడు. అలాగే, భారత్ తరఫున 3 సెంచరీలు చేసిన నాన్ ఓపెనర్ బ్యాట్స్మన్గా సూర్య నిలిచాడు. ఇప్పటివరకు టీమిండియా తరఫున రోహిత్ శర్మ 4 సెంచరీలు నమోదు చేశాడు. రోహిత్ శర్మ 148 ఇన్నింగ్సుల్లో 4 సెంచరీలు చేస్తే.. సూర్యకుమార్ యాదవ్ కేవలం 43 ఇన్నింగ్సుల్లోనే 3 సెంచరీలు నమోదు చేయడం విశేషం.