ఈ నెల 14న దిల్లీలో భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) కార్యాలయాన్ని ప్రారంభిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో బీఆర్ఎస్ ముందుకు వెళ్తుందని ఆయన వెల్లడించారు. దేశంలో సహజ వనరులకు కొదవ లేదని.. వాటిని సమర్థంగా ఉపయోగించాలని కేసీఆర్ సూచించారు. నీళ్లు, మానవ వనరులు ఉన్నప్పటికీ దేశం ఆకలి సూచీలో ఎందుకు నిలుస్తుందో అర్థం కావట్లేదని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాష్ట్రాల మధ్య జలయుద్ధాలు ఉండబోవని స్పష్టం చేశారు. పార్టీ పాలసీని త్వరలోనే రూపొందిస్తామని కేసీఆర్ తెలిపారు.