వన్డేల్లో టీమిండియా ఓపెనింగ్ సమస్యకు చెక్ పెడుతూ రోహిత్, గిల్ ద్వయం చెలరేగుతోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి సొంతగడ్డపై టీమిండియా ఆరు వన్డేలు ఆడింది. తొలి పవర్‌ప్లే(10 ఓవర్లు)లో టీమిండియా స్కోరు మెరుగ్గా ఉంది. తొలి 10 ఓవర్లకు శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల్లో 75/0, 67/3, 75/0 స్కోర్లు నమోదయ్యాయి. న్యూజిలాండ్‌తో 48/0, 52/0, 82/0గా ఉన్నాయి. రన్‌రేట్ విషయాన్ని పక్కన పెడితే కేవలం ఒకేసారి పవర్‌ప్లేలో భారత్ వికెట్లు కోల్పోయింది. రోహిత్, గిల్ల ద్వయం ఇలాగే రాణిస్తే వరల్డ్‌కప్‌లో టీమిండియాకు తిరుగే ఉండదు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఓపెనింగ్ ద్వయం విఫలమైంది.