శ్రీలంకతో టీ 20 సిరీస్ రేపట్నుంచి ప్రారంభం కానుంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో యువ ఆటగాళ్లతో టీమిండిమయా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే కుర్రాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ మ్యాచుల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనే విషయంలో చాలా ఉత్కంఠ నెలకొంది. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్‌లో ఎవరికో ఒకరికి అవకాశం దక్కుతుంది. సంజూ శాంసన్‌ను తీసుకుంటారో లేదో అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ కచ్చితంగా జట్టులో ఉంటారని తెలుస్తోంది.