తెలంగాణలో మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు మధ్యాహ్నం పూట ఎక్కువగా బయట తిరొగద్దని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రోజుల్లో వేడిగాలులు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కావున ఎవరూ కూడా బయట తిరొగద్దని ఆదేశించింది. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వరకు 1500 మీ.ఎత్తులో ఉపరిత ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో అక్కడక్కడ చిరు జల్లులు పడే అవకాశం ఉందని సూచించింది.