‘ఎవరినీ ఎక్కువకాలం మనస్ఫూర్తిగా ప్రేమించలేం’ అనే విభిన్న లైన్‌తో తెరకెక్కిన సినిమా ఆరెంజ్. రామ్‌చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలై నేటికి 12ఏళ్లు పూర్తయింది. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలంటే యువతకు ఎంతో ఆసక్తి. కానీ, అప్పట్లో థియేటర్లలో ప్రేక్షకుడిని మెప్పించలేక పోయింది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు హ్యారస్ జయరాజ్ సంగీతం అందించారు. జెనీలియా, షజన్ పదంసీ రామ్‌చరణ్ సరసన నటించారు. మరి, ఈ సినిమాలో మీకిష్టమైన పాటేంటో కామెంట్ చేయండి.