వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని కోరారు. నాకు సీబీఐ 160 సీఆర్పీసీ నోటీసు ఇచ్చిందని… దీని ప్రకారం నన్ను అరెస్ట్ చేయకుండా ఆదేశించాలన్నారు. అవినాశ్ రెడ్డి రేపు సీబీఐ ఎదుట హాజరు కావాలి. ప్రస్తుతం అతడు హైకోర్టును ఆశ్రయించడంతో సందిగ్ధత నెలకొంది.