ప్రముఖ అమెరికన్ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత విలియమ్ హర్ట్(71) మార్చి 13న కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అధికారికంగా వెల్లడించాడు. విలియం హర్ట్ ‘ది బిగ్ చిల్’, ‘ఎ హిస్టరీ ఆఫ్ వైలెన్స్’ వంటి సినిమాలతో ఫేమ్ సంపాదించుకున్నాడు. 1985లో ‘కిస్ ఆఫ్ ది స్పైడర్ వుమెన్’ అనే సినిమాలో గే పాత్ర పోషించాడు. ఈ సినిమాకు గాను ఆయనకు ఆస్కార్ అవార్డ్ లభించింది. అదేవిధంగా ‘చిల్డ్రన్ ఆఫ్ లెస్సర్ గాడ్’ అనే సినిమాలో చెవిటి పిల్లలకు టీచర్‌గా నటించాడు. ఈ సినిమాకు గాను 1986 సంవత్సరంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యాడు. మరోవైపు 1987 లో బ్రాడ్కాస్ట్ న్యూస్ స్లో-విట్టెడ్ టీవీ యాంకర్‌గా ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యాడు.