ఆస్కార్ 2023 అవార్డులకు సంబంధించి ఓటింగ్ పూర్తైంది. జనవరి 11 నుంచి 17 వరకు ఈ ప్రక్రియ ముగిసింది. దాదాపు 80 దేశాలకు చెందిన అకాడమీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. భారత్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా ఓటు వేశారు. 95 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరగడం ఇదే మొదటిసారని అకాడమీ సీఆర్ఓ బిల్ క్రామెర్ ఆనందం వ్యక్తం చేశాడు. కాగా జనవరి 24న ఆస్కార్‌కు నామినేట్ అయిన చిత్రాలను ప్రకటిస్తారు. అనంతరం మార్చి 12న ఆస్కార్ వేడుక నిర్వహిస్తారు.