త్వరలో తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు కాబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు TSPSC అధికారులు ఉద్యోగ ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్లను ప్రకటించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో TSPSC వెబ్సైట్ లోని వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)లో మార్పులు చేర్పులు చేయనున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ అవకాశం అందుబాటులోకి రానుంది. ఇందులో స్థానికత, విద్యార్హతలను అప్డేట్ చేసుకోవచ్చు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల స్వరూపం పూర్తిగా మారిన నేపథ్యంలో స్థానికత అర్హతలు మారబోతున్నాయి. ఇప్పటివరకు 4-10 తరగతుల వరకు నాలుగేళ్లు ఎక్కడ చదివితే అదే జిల్లాలో స్థానికుడిగా పరిగణించేవారు. కానీ ప్రస్తుతం 1-7 తరగతులల్లో చివరి నాలుగేళ్లు ఏ జిల్లా/జోన్/మల్టీ జోన్లలో చదువుతారో ఆ జిల్లా/జోన్/మల్టీ జోన్ లలో స్థానికుడిగా పరిగణించబడతారు.