ఉస్మానియా యూనివర్సిటీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.746.32 కోట్ల బడ్జెట్‌ని ప్రవేశపెట్టింది. మొత్తం ఆదాయం రూ.682.22 కోట్లు కాగా వ్యయం రూ.746.32 కోట్లుగా చూపెట్టారు. దీంతో లోటు బడ్జెట్ రూ.37.56 కోట్లు అని యూనివర్సిటీ అకాడమీ సెనెట్‌లో కామర్స్ ప్రొఫెసర్ వి.అప్పారావు పేర్కొన్నారు. బడ్జెట్లో ఎక్కువ మొత్తాన్ని ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకే కేటాయించారు. వేతనాలకు రూ.406.53 కోట్లు, పెన్షన్లకు రూ.285 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.