న్యూజిలాండ్ సిరీస్‌ని క్లీన్‌స్వీప్ చేసి ర్యాంకింగ్స్‌లో టీమిండియా తొలి స్థానానికి ఎగబాకింది. అయితే, ర్యాంకింగ్స్‌ని అస్సలు పట్టించుకోమని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ప్లాన్ ప్రకారం ఆడటం చాలా ముఖ్యమని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు. ‘మాకు ర్యాంకులు ముఖ్యం కాదు. వన్డేల్లో ప్రణాళికతో ఆడటం ముఖ్యం. గత 6 మ్యాచుల్లో విజయవంతం అయ్యాం. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ అంత సులువేం కాదు. అయినా, తప్పకుండా పైచేయి సాధిస్తామనే నమ్మకం ఉంది. గిల్, శార్దూల్, కుల్‌దీప్ మెరుగ్గా రాణించడం సంతోషకరం. నా సెంచరీ కూడా ఆనందాన్నిచ్చింది’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.