దేశంలోని పిచ్‌లు స్థాయికి తగ్గట్టు లేవని టీమిండియా మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు. ఇలాంటి బ్యాటింగ్ పిచ్‌లపై సులువుగా 400 పరుగులు చేయగలరని, అప్పుడు ఆసక్తి పోతుందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ప్రపంచకప్ సమయంలో పిచ్‌లు ఇలా ఉంటే కేవలం బ్యాటింగ్‌ని ఆస్వాదిస్తారని చెప్పాడు. ‘వన్డేల్లో ఈ పిచ్‌లు ఉంటే పరుగుల వరదే. కానీ, ఇలాగే కొనసాగితే ఆసక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రపంచకప్ మ్యాచులకు ఇవి అనువైనవి కావని నా అభిప్రాయం. ఎందుకంటే సులువుగా 400 రన్స్ చేయగలరు. అప్పుడు ఈ స్కోరుకు విలువ ఉండకపోవచ్చు’ అని ఆకాశ్ చెప్పాడు.