తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద రాష్ట్రం నుంచి 1200 పాఠశాలలను ఎంపిక చేశారు. మౌలిక వసతుల కల్పించి సాంకేతిక సొబగులతో ప్రభుత్వ పాఠశాల విద్యను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణం, ఆధునిక పద్ధతుల్లో బోధన ఉంటే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చేని యోచిస్తోంది. ఈ పథకం కింద మూడేళ్లలో రూ. 46 లక్షలు అందించనున్నారు.