హైదరాబాద్‌లో ఇటీవల వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, దేశవ్యాప్తంగా వీధికుక్కల సమస్య వేధిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా, బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఒక్కరోజులోనే 150కు పైగా డాగ్ బైట్ కేసులు నమోదయ్యాయి. బాధితులలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. దీంతో అప్రమత్తమైన మున్సిపాలిటీ యంత్రాంగం వీధికుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటోంది. వీధికుక్కలను పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. వీధికుక్కల సమస్యపై ఏ పరిష్కారం చూపితే బాగుంటుంది? కామెంట్ చేయండి.