ఇటీవల చైనాలో కరోనా కేసులు విజృంభించిన తర్వాత తాజాగా మళ్లీ దక్షిణ కొరియాలో కూడా కరోనా వ్యాపిస్తోంది. బుధవారం ఒక్కరోజే అక్కడ 4 లక్షలకుపైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది నుంచి రికార్డైన బాధితుల్లో ఇవే అత్యధికమని అక్కడి అధికారులు చెబుతున్నారు. గత 24 గంటల్లో మహమ్మారి కారణంగా 293 మంది మృతి చెందినట్లు వారు ప్రకటించారు. మరోవైపు చైనాలో కరోనా కారణంగా దాదాపు 17 మిలియన్లకు పైగా ప్రజలు లాక్ డౌన్ లో ఉన్నారు. బుధవారం చైనాలో 3,290 కోవిడ్ కేసులు రికార్డయ్యాయి.